పర్సనల్ లోన్ అనేది అత్యవసరాలు అంటే హాస్పిటల్ ఖర్చులు, విద్యా ఖర్చులు, ఇంటి పనులు, వివాహాలు వంటి అత్యవసర అవసరాలకు ఉపయోగపడుతుంది. గృహ లేదా వాహన రుణాల వంటి వాటికి ఇది అవసరం లేకపోవడం వలన ఇది ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది. కానీ, పర్సనల్ లోన్ లకు సాధారణంగా తక్కువ కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. అందుకే సరైన లోన్ ని ఎంచుకోవడం మంచిది. మీకు ఎంత అయితే అవసరమో ఆ మొత్తాన్ని మాత్రమే అప్పు తీసుకోండి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుంది. అలాగే మీ మంత్లీ బడ్జెట్లో ఎంతైతే కట్టగలరో అంత మాత్రమే తిరిగి చెల్లించేలా ఒక పద్ధతిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
పర్సనల్ లోన్ పొందడం ఎలా, ప్రభుత్వ & PSU బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, NBFCs, సాధారణ వడ్డీ రేట్లు, రుణ పరిమితులు, అర్హతలు, దరఖాస్తు చిట్కాలు, మరియు స్మార్ట్ గా తీసుకున్న లోన్లు తిరిగి ఎలా చెల్లించాలో వ్యూహాలు ఇప్పుడు చూదాం.

పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
పర్సనల్ లోన్ అనేది అన్ సెక్యూరిడ్ లోన్, అంటే మీరు మీ ఇల్లు, భూమి, బంగారం వంటి ఆస్తులను సెక్యూరిటీగా పెట్టాల్సిన అవసరం ఉండదు వీటికి. ఎవరైతే రుణాలు ఇచ్చే వారినుండి ఒక మొత్తాన్ని పొందుతూ, దానిని నెలవారీ ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లిస్తూ ఉండడం అన్నమాట.
ఉదాహరణకు, మీరు 3 సంవత్సరాల పాటు 12% వడ్డీతో ₹3 లక్షలు రుణం తీసుకుంటే, నెలకు సుమారు ₹9,964 రూపాయిలు ఈఎంఐ చెల్లించాలి. తక్కువ సంవత్సరాలు ఎంచుకుంటే ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి కానీ మొత్తం వడ్డీ తక్కువగా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐలు తక్కువగా ఉంటాయి కానీ మొత్తం వడ్డీ పెరుగుతుంది. ప్రభుత్వ/పిఎస్యూ బ్యాంకుల నుండి పర్సనల్ లోన్ ప్రభుత్వ రంగ బ్యాంకులు నుండి జీతం పొందేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పిఎస్యూ ఉద్యోగులకు అనుకూలమైన రుణాలు అందిస్తాయి.
1. ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు:
SBI: వారు సుమారు 10%–15% వడ్డీతో 50 లక్షల వరకూ లోన్ మంజూరు చేస్తుంది.
Bank of Baroda: 10.15%–17.50% వరకు ₹20 లక్షల వరకు.
Union Bank of India: సుమారు 8.75% వడ్డీతో 15% లక్షలు వరకు లోన్ ఇస్తారు.
Punjab National Bank (PNB): వారు 10% నుండి 16% వరకు వడ్డీ తో ₹20 లక్షలు వరకు ఇస్తారు.
Indian Bank: వారు 9% నుండి 15% వరకు వడ్డీతో 50 లక్షలు వరకు ఇవ్వగలరు.
గమనిక: ప్రకటనలో ఇచ్చే బ్యాంకు వడ్డీ రేట్లు సూచనాత్మకమే. మీ వాస్తవ వడ్డీ రేటు అనేది మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, మీ ప్రస్తుత ఉద్యోగ స్థితి, మీ నెల జీతం మరియు రుణదాత caliculation పై ఆధారపడి ఉంటుంది. అందుకోసం మీరు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల యొక్క సొంత వెబ్సైట్స్ లోకి వెళ్లి వడ్డీరేట్లు, ఎంత లోన్ వస్తుంది, ఎన్ని సంవత్సరాలకు అనేది మీరే నేరుగా చెక్ చేసుకోండి.
2. ప్రైవేట్ బ్యాంకులు:
ప్రభుత్వ బ్యాంకులు కంటే ప్రైవేట్ బ్యాంకుల నుండి వ్యక్తిగత రుణాలు ఎక్కువగా డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా వేగం చేస్తూ, ఇప్పటికే ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాంకు ఖాతాదారులకు ముందుగా తొందరగా ఆఫర్లు అందిస్తాయి.
- ICICI బ్యాంక్: ₹50 లక్షల వరకు రుణాలు, వడ్డీ రేటు ప్రారంభం 9.99% p.a. కాలపరిమితి 72 నెలలు వరకు.
- Axis బ్యాంక్: ₹40 లక్షల వరకు రుణాలు, వడ్డీ రేటు సుమారు 9.99% p.a. కాలపరిమితి 12-84 నెలలు.
- HDFC బ్యాంక్: 50 లక్షల వరకు రుణాలు, వడ్డీ రేటు ప్రారంభం 9% నుండి 23% p.a. కాలపరిమితి 72 నెలలు వరకు.
- Kotak Mahindra Bank: ₹40 లక్షల వరకు రుణాలు, వడ్డీ రేటు ప్రారంభం 9% నుండి స్టార్ట్ అవుతుంది. కాలపరిమితి 72 నెలలు వరకు.
- IDFC FIRST Bank లో 50 లక్షల వరకు. 9.99% నుండి వడ్డీ స్టార్ట్ అవుతుంది.
- ఎప్పుడూ ఆఫర్లను అంగీకరించే ముందు వడ్డీ రేట్లు, ఫీజులు ఎలా ఉన్నాయి అని చెక్ చేయడం మరిచిపోవద్దు.
3. NBFCs (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు):
వ్యక్తిగత రుణాలు NBFC లు కూడా వ్యక్తిగత రుణాలను అందిస్తాయి, కొన్ని ప్రముఖ సంస్థలు:
- బజాజ్ ఫైనాన్స్: ₹40,000 నుండి ₹55 లక్షల వరకు, వడ్డీ రేట్లు 10% నుండి 30.5%, 12 నుండి 108 నెలలు వరకు.
- టాటా క్యాపిటల్: వడ్డీ రేట్లు 10.99% నుండి, రుణ పరిమితులు ₹75,000 నుండి ₹35 లక్షలు వరకు ఇస్తారు.
- ఆదిత్య బిర్లా క్యాపిటల్: వడ్డీ రేట్లు సుమారు 10.99% నుండి స్టార్ట్ అవుతుంది. నిబంధనలు వ్యక్తిగత ప్రొఫైల్ ఆధారంగా.
మీకు బ్యాంకులు ఇచ్చే ఆఫర్లు నచ్చకపోతే NBFC లకు అప్లై చేయండి. కానీ ఎవరు లోన్ వేగంగా ఇస్తున్నారు అనేదాని కంటే ముఖ్యంగా మీ ఖర్చులు ఎలా ఉన్నాయి అనేది గుర్తుంచుకోండి.

మీరు ఎలాంటి పర్సనల్ లోన్ లను ఎంచుకోవాలి అంటే?
ప్రస్తుతం మీకు శాలరీ అకౌంట్ గనుక ఉండి నెల నెలా జీతం వస్తుంటే ఇంకా మంచిది. మీకు ముందుగానే కొన్ని ఆఫర్లు ఇస్తారు. బ్యాంకు వారిని సంప్రదిస్తే వారే ఆన్లైన్ లో లోన్ మంజూరు చేస్తారు. డైరెక్ట్ గా మీ బ్యాంకు అకౌంట్ కి పడిపోతుంది.
ఇతర పిఎస్యూ మరియు ప్రైవేట్ బ్యాంకులను సంప్రదించే ముందు కనీసం రెండు లేదా మూడు బ్యాంకుల ఆఫర్లను వాటి యొక్క వడ్డీ రేట్లు, ఫీజులు, కాలపరిమితులు, ఎంత EMI పడుతుంది నెలకి మరియు తిరిగి చెల్లించడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అనేది చెక్ చేయండి.
బ్యాంకులు సరైన ఆఫర్లు ఇస్తే సరి లేకపోతే అప్పుడు NBFCలకు అప్లై చేయండి. అది కూడా మంచి ఆఫర్ లను ఇస్తేనే.
పర్సనల్ లోన్ కావాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు:
- భారతీయులై ఉండాలి
- కనీస వయస్సు
- స్థిరమైన ఆదాయం (జీతం లేదా వ్యాపారం)
- మంచి క్రెడిట్ స్కోర్ (CIBIL)
- నెల నెలా ఈఎంఐలు కట్టగలగాలి
- అవసరమైన KYC మరియు ఆదాయ పత్రాలు
- బలమైన క్రెడిట్ చరిత్ర మీరు లోన్ పొందడానికి అవకాశాలను పెంచుతుంది మరియు వడ్డీ రేట్లను తగ్గిస్తుంది.
ఉద్యోగులకు కావలసిన పత్రాలు:
- పాన్ కార్డు, ఆధార్ కార్డు
- సాలరీ స్లిప్స్
- బ్యాంక్ స్టేట్మెంట్లు
- ఉద్యోగ ధృవపత్రం
- పాస్పోర్ట్ సైజు ఫోటో
సెల్ఫ్ ఎంప్లాయిస్ లకు కావలసిన పత్రాలు:
- ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR)
- వ్యాపార పత్రాలు, ఆర్థిక నివేదికలు
- బ్యాంక్ స్టేట్మెంట్లు
- GST లేదా ఇతర వ్యాపార పత్రాలు
వ్యక్తిగత రుణ ఆమోదం కోసం కొన్ని చిట్కాలు:
- బిల్లులు సకాలంలో చెల్లించి మంచి క్రెడిట్ స్కోరు పెంచుకోండి.
- ఇప్పటికే ఉన్న ఈఎంఐలను నియంత్రణలో ఉంచండి.
- మీకు ఎంత లోన్ తీసుకుంటే సరిపోతుందో అంత మాత్రమే రుణంగా తీసుకోండి.
- అనేక రుణ ఆఫర్లను జాగ్రత్తగా గమనించండి.
- మీ క్రెడిట్ ప్రొఫైల్ గనుక బలంగా ఉంటే వడ్డీ రేట్లు, ఫీజులు గురించి కూడా చర్చించండి.
- సెక్యూర్డ్ లోన్స్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి, unsecured లోన్స్ వాటి జోలికి పోకండి.
- బ్యాంకులు మరియు RBI నియంత్రిత NBFC లను మాత్రమే ఎంపిక చేసుకోండి.

ఎక్కువ మొత్తంలో వడ్డీ పడుతుంది కాబట్టి, స్మార్ట్ గా తొందరగా మీ లోన్ లను తిరిగి ఎలా చెల్లించాలి?
- ఈఎంఐ లను సమయానికి చెల్లించడానికి ఆటో-డెబిట్ లేదా రిమైండర్లు ఉపయోగించండి.
- అత్యవసర నిధులు ఏర్పాటుచేసి చెల్లింపు ఎప్పటికప్పుడు జరగకుండా చూసుకోండి.
- బోనస్ లేదా అదనపు ఆదాయాన్ని ముందస్తు చెల్లింపులకు ఉపయోగించండి, అయితే ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉండొచ్చు.
- ముందస్తు చెల్లింపులకు సంబంధించి లోన్ యొక్క ఒప్పందం నిబంధనలు పరిశీలించండి.
పర్సనల్ లోన్ తీసుకున్నాక చేయకూడని తప్పులు:
- అనవసరమైన ఖర్చుల కోసం రుణం తీసుకోవద్దు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్.
- అవసరమైనంత దానికంటే ఎక్కువ రుణం తీసుకోవద్దు.
- తక్కువ EMI కోసం ఎక్కువ కాలపరిమితి ఎంచుకోవద్దు.
- ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను పట్టించుకోకోవద్దు.
- ఒకేసారి అనేక లోన్ లకు దరఖాస్తు చేయవద్దు. ఆలా చేస్తే మీ సిబిల్ స్కోర్ దెబ్బ తింటుంది, లోన్ రిజెక్ట్ అవుతుంది కూడా.
- EMI చెల్లింపులు మిస్ చేయవద్దు. ఎప్పటికప్పుడు కట్టేయండి లేకపోతే పెనాల్టీలు, సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.
- Unregulated డిజిటల్ లొన్ యాప్స్ ఉపయోగించవద్దు.
- పాత లోన్ తీర్చడానికి, కొత్త లోన్ తీసుకునే ముందు మీ మొత్తం నెలవారి ఖర్చులు ఎంత లెక్కలేయండి సరిపోద్ది అనుకుంటే కొత్త లోన్ కి వెళ్ళవచ్చు.
- ముందుగా చెల్లించే EMI ల రూల్స్ & రెగ్యులేషన్స్ ని పక్కన పెట్టవద్దు.
- మీ లోన్ డాకుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి.

గమనిక: పర్సనల్ లోన్ అనగానే చాలా మంది చేసే అతి పెద్ద తప్పు లోన్ రాగానే ఇష్టమొచ్చినట్టు దుబారాగా ఖర్చు చేసేస్తారు. తిరిగి కట్టేటప్పుడు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. తిరిగి కట్టలేక కొంత మంది సూసైడ్ లు కూడా చేసుకుంటున్నారు, తిరిగి కట్టగలిగి తేనె తీసుకోండి. లేకపోతే వద్దు. అంతే గాని మీ ప్రాణం మీదకు తెచ్చుకోవదు. మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎంతో కస్టపడి, 20 ఏళ్ళు పెంచి పోషిస్తే వాళ్ళకి కన్నీళ్లు మిగిలిస్తారా. చిన్న చిన్న సరదాలకు,పార్టీలకు, ఆనందాలకు, ఆడంబరాలకు కాదు పర్సనల్ లోన్లు. లోన్లు అనేవి మీ భవిష్యత్తుకు బంగారుబాట వేయడం కోసం అనవసరంగా ఖర్చు చేయడానికి కాదు. లోన్ అనేది మీ చదువు, ఇల్లు, ఏదైనా చిన్న వ్యాపారం మీద పెట్టుబడి, వ్యవసాయం లో పెట్టుబడి కోసం ఖర్చుచేయండి. పర్సనల్ లోన్లు చాలా ఎక్కువ వడ్డీ రేటుతో ఉంటుంది కాబట్టి బాగా అలోచించి ప్రతినెలా కట్టగలము అనిపిస్తేనే తీసుకోండి.
