మ్యుచువల్ ఫండ్స్ లో SIP ఎలా స్టార్ట్ చేయాలి?

అసలు మ్యుచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అందులో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారా? రిచ్ పీపుల్ రిచ్, పూర్ పీపుల్ పూర్ గా ఎందుకు అవుతున్నారు అంటే ఒక్క శాలరీ మీదే ఆధారపడడం, ఒక్క సంపాదన మీదే ఆధారపడి బ్రతకడం పూర్ మరియు మధ్యతరగతి ప్రజలు చేసే తప్పు. కానీ రిచ్ పీపుల్, తమ వద్ద ఉన్న కొంత డబ్బునే డబల్ ఎలా చేయాలని చూస్తారు. 100 రూపాయలు ఉంటే దానికి ఇంకో వంద రూపాయలు ఎలా సంపాదించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తారు. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తారు. పుట్టుకతో ఎవరూ కోటీశ్వరులు కాలేదు, వాళ్ళు మెల్ల మెల్లగా సంపద కూడా బెట్టి ఎక్కడో ఒక దగ్గర పెట్టుబడి పెట్టి అలా కోటీశ్వరులు అయ్యారు. మరి మీరు కూడా బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా.. అయితే మీరూ శాలరీ మీద మాత్రమే ఆధారపడకుండా మీ సంపాదనలో కొంత సేవ్ చేస్తారు కదా అందులో కొంత భాగం డబ్బు తీసుకెళ్లి మ్యుచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి.

SIP – (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) అనేది మ్యూచువల్ ఫండ్స్ లో, వివిధ అసెట్ క్లాసెస్ లో పెట్టుబడి పెట్టడం అంటే ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, గోల్డ్ etc.. వంటి వాటిలో. ఈ SIP నీ లాంగ్ టర్మ్ లో కంటిన్యూ చేయాలి అప్పుడే మంచి రిటర్న్స్ ఇస్తాయి. అంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆలా ఉంచేయాలి. లేదు ఒక్క రోజులో, ఒక్క సంవత్సరంలో సంపాదించేయాలి అంటే అవ్వదు, ఇది గ్యాంబ్లింగ్ కాదు ఒక్క రోజులో కోటీశ్వరుడు అవ్వడానికి.

ఇందులో మీరు పెద్ద మొత్తాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. చాలా mutual funds నెలకు ₹500 నుండి ప్రారంభం అవుతాయి. అత్యధిక రాబడిని అందించే SIP ఎంచుకోవడమే కాదు, మీ లక్ష్యం, పెట్టుబడి కాలం, రిస్క్, ఓపిక మరియు mutual fund రకం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఈ గైడ్‌లో కొత్తగా ఎవరైతే పెట్టుబడులు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారు SIP వర్గాలు, SIP ఎలా ప్రారంభించాలి, ₹500 నుండి ₹15,000 నెలవారీ పెట్టుబడుల 20 సంవత్సరాల వరకు రాబడి ఉదాహరణలు, పన్నుల వివరాలు, ముఖ్యమైన నియమాలు మరియు తప్పులు సులభంగా అర్థమయ్యేలా కిందన ఇవ్వబడ్డాయి చదివి అర్ధం చేసుకోండి.

SIP అంటే ఏమిటి?

SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టడం కాకుండా, మీరు నెలకు ఇంత అయితే పెట్టుబడి పెట్టగలను అని ఒక అమౌంట్ డిసైడ్ అవ్వడం. ఉదాహరణకు: ₹500, ₹1,000, ₹5,000, ₹10,000, ₹15,000…etc.. అలా ప్రతీ నెలా ఎంతో కొంత ఫిక్స్ అవ్వాలి.
అది mutual fund యూనిట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది, fund యొక్క NAV ఆధారంగా. SIP అనేది ఒక పెట్టుబడి పద్ధతి మాత్రమే, ఇది ప్రత్యేక mutual fund రకం కాదు. మీరు వివిధ mutual fund వర్గాలలో SIP ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. AMFI ప్రకారం, SIP investors కి క్రమం తప్పకుండా పెట్టుబడి చేయడంలో సహాయపడుతుంది మరియు మార్కెట్ సమయాన్ని అంచనా వేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.

కొత్తగా ప్రారంభించేవారికి ఏ SIP మంచిది?

ప్రతి ఒక్కరికీ ఒకే fund సరైనది కాకపోవచ్చు. 10-20 సంవత్సరాల టైం హారిజన్ ఉండి కొత్తగా ప్రారంభించేవారికి సాధారణంగా మంచి ఎంపిక ఇది:

  1. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్: ఇది నిఫ్టీ 50 సూచికను ట్రాక్ చేస్తుంది, టాప్ 50 కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది.
    సులభంగా విభజింపబడిన ఈక్విటీ పెట్టుబడులను కోరుకునే వారికి ఇది ఉత్తమం.
  2. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్: ఇది నిఫ్టీ 50 తర్వాత వచ్చే 50 పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది, కొంత వరకు ఎక్కువ మార్కెట్ ఒడిదొడుకులు ఉంటుంది.
    ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు, మార్కెట్ మార్పులను సహించగల వారికి ఉత్తమం.
  3. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్: ఇది మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది, ఫండ్ మేనేజర్‌కు వ్యూహాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది.
    ఒకే fund లో విభజింపబడిన, యాక్టివ్ మేనేజ్డ్ ఈక్విటీ fund కావాలనుకునేవారికి ఉత్తమం.
  4. లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్: ఇది లార్జ్ & మిడ్ క్యాప్ కంపెనీలలో విభజింపబడిన పెట్టుబడులు.
    ఇది దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టె వారికి, మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకునే వారికి మంచిది.

కొత్తగా పెట్టుబడులు ప్రారంభించాలి అనుకునే వారు అన్ని funds లో పెట్టుబదులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మొదట ఒక బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ లేదా ఒక విభజింపబడిన ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ని ఎంచుకోవచ్చు.

SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?

ఫిక్స్డ్ ఇంత అమౌంట్ అని లేదు. మీరు మీ నెలవారీ ఆదాయం నుండి అవసరమైన ఖర్చులు + EMI చెల్లింపులు తీసివేసి, తక్కింది ఎంతైతే అమౌంట్ మిగులుతుందో ఆ అమౌంట్ మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఉదాహరణ: మీకు అన్నీ ఖర్చులు పోనూ ₹5,000 మిగిలితే, అందులో ₹2,000 లేదా ₹3,000 SIPతో ప్రారంభించండి. మీకు ఆదాయం పెరిగినప్పుడల్లా ఇంకా ఇంకా ఎక్కువ SIP చేయడం పెంచండి. దీనివల్ల స్టెప్-అప్ SIP జరుగుతుంది. మీ జీతం పెరిగిన ప్రతిసారీ SIP అమౌంట్ ని కూడా పెంచుకుంటూ పోండి. ఇలా చేయడం వలన ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగలుగుతారు, ఎక్కువ రిటర్న్స్ మీకు వస్తుంది.

మీరు SIPలో 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో ఇప్పుడు చూదాం:

  • మీరు నెలవారీ 500 రూపాయిలు గనుక SIP చేస్తే, 20 సంవత్సరాల్లో అది మొత్తం పెట్టుబడి విలువ ₹1.20 లక్షలు కాగా, అది12% వడ్డీ ఇచ్చినా అది సుమారు ₹5.00 లక్షలు అవుతుంది. ఏది అంచనా మాత్రమే మార్కెట్ రిటర్న్స్ ప్రకారం ఎక్కువ ఇవ్వ వచ్చు తక్కువ ఇవ్వ వచ్చు.
  • అలాగే మీరు నెలకి ₹1,000 రూపాయిలు గనుక SIP చేస్తే, అది 20 సంవత్సరాల్లో అది మొత్తం పెట్టుబడి విలువ ₹2.40 లక్షలు అవుతుంది. ₹9.99 లక్షలు రిటర్న్స్ మీకు వస్తుంది.
  • అలాగే మీరు నెలకి ₹5,000 రూపాయిలు గనుక SIP చేస్తే, అది 20 సంవత్సరాల్లో దాని మొత్తం పెట్టుబడి విలువ ₹12 లక్షలు కాగా, మెచ్యూరిటీ డేట్ కల్లా అది సుమారు ₹49.96 లక్షలు మీకు సంపాదించి పెడుతుంది.
  • అలాగే మీరు నెలకి ₹10,000 రూపాయిలు గనుక SIP చేస్తే, అది 20 సంవత్సరాల్లో దాని మొత్తం పెట్టుబడి విలువ ₹24 లక్షలు కాగా సంవత్సరానికి 12% వడ్డీ చొప్పున అది అసలు + వడ్డీ కలిపి ₹99.91 లక్షలు రిటర్న్స్ వస్తుంది.
  • మీరు నెలకి ₹15,000 చొప్పున SIP చేస్తే, అది 20 సంవత్సరాల్లో దాని మొత్తం పెట్టుబడి విలువ ₹36 లక్షలు అవుతుంది. రిటర్న్స్ ₹1.50 కోట్లు అవుతుంది.

ఇది వినడానికి చాలా వినసొంపుగా ఉన్నా, ఇది నిజం. కానీ అంత డబ్బు సంపాదించడానికి మనకు 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా పెట్టుబడి పెట్టేంత స్థోమత, ఓర్పు, సహనం కావాలి. అంత సహనం ఈ రోజుల్లో ఎవరికీ ఉంది చెప్పండి అతి కొద్దీ మందే చేయగలరు. చాలా మంది SIP స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలోనే ఆపేస్తారు. కొందరు సంవత్సరం తిరగ కుండానే SIP ఆపేస్తారు. అలా చేయడం వలన మంచి రిటర్న్స్ రాదు, సంవత్సరంలోగా withdraw చేసుకుంటే 20% వరకు టాక్స్ పడిపోతుంది. ఎవరైతే 5 సంవత్సరాలు కంటే పైబడి పెట్టుబడులు కొనసాగిస్తారో వారికి మంచి రిటర్న్స్ ఇస్తాయి.

ఇవి ఊహాత్మక లెక్కింపులు మాత్రమే అయినా. mutual fund రాబడులు అనేవి మార్కెట్ రిస్క్ పై ఆధారంగా ఉంటాయి మరియు ఎలాంటి హామీలు ఇవ్వబడవు. SIP ప్రారంభించే ముందు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన పాయింట్ ఇది.
గ్యారెంటీ రాబడులు ఉండదు. SIP అనేది స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి, మీరు పెట్టిన పెట్టుబడి విలువలో కొంత తగ్గిపోవచ్చు కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే, మీరు పెట్టిన డబ్బును ముచ్యువల్ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తుంటారు.

  1. మార్కెట్ రిస్క్ అర్థం చేసుకోండి: ఈక్విటీ funds ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. ఎక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. తక్కువ రిస్క్ తక్కువ రిటర్న్స్ ఇస్తాయి.
  2. ఎక్స్‌పెన్స్ రేషియో చూడండి: Direct Plans లో ఖర్చులు తక్కువగా ఉంటాయి. 1% కంటే తక్కువ ఎక్సపెన్స్ రేషియో ఉన్నది సెలెక్ట్ చేసుకోండి.
  3. Direct vs Regular: Direct Plan లో తక్కువ ఖర్చుతో సొంతంగా రీసెర్చ్ మనమే చేసి SIP చేసుకుంటాం. అదే regular plan సెలెక్ట్ చేసుకుంటే, ఫండ్ రీసెర్చ్ మన తరుపున ఫండ్ మేనేజర్ చేసి పెట్టుబడి పెడతాడు అతనికి మనం కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి.
  4. Growth vs Dividend: దీర్ఘకాలిక సంపద కోసం అయితే Growth ఆప్షన్ ఎంచుకోవడం మంచిది.

SIP ఎలా ప్రారంభించాలి?

ముందు మీ లక్ష్యం నిర్ణయించుకోండి. ఉదా: రిటైర్మెంట్, పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు. దేనికోసం SIP చేయాలి అనుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు వరకు పెట్టాలనుకుంటున్నారు. పెట్టుబడి కాలపరిమితి ఎంత, 10 లేదా 20 సంవత్సరాలు పెట్టాలనుకుంటున్నారా అది నిర్ణయించుకోండి.మన ఇండియాలో సెబీ రెగ్యులేటెడ్ మొబైల్ యాప్స్ ఉంటాయి. అవి మాత్రమే download చేసుకోండి. unauthorised apps లో పెట్టుబడి పెట్టి లాస్ అవ్వడం ఎందుకు. గూగుల్ లో సెర్చ్ చేయండి. mutual funds లో SIP కోసం మంచి govt. regulated apps ఏవి అని. అదే చెప్తుంది.

  • మంచి ట్రస్టెడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని login అయ్యి KYC పూర్తి చేయండి.
  • తర్వాత మీ రిస్క్ ప్రొఫైల్‌కు సరిపోయే మంచి mutual fund ఎంచుకోండి.
  • Direct Plan ఎంచుకోండి. ఎంచుకున్న ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలావుందీ, లాస్ట్ వన్ ఇయర్ కి ఎంత, లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చెక్ చేయండి.
  • Return calculator లో calculate చేయండి ఎంత పెడితే ఎంత రిటర్న్స్ వస్తుంది ఎన్ని సంవత్సరాలకు అనేది చెక్ చేసి అర్ధం చేసుకుని అప్పుడు స్టార్ట్ చేయండి.
  • మీ డబ్బు అంత ఒకటే ఫండ్ లో SIP చేయకండి. 5 వేలు SIP చేయాలి అనుకుంటే 5 బెస్ట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని ఒక్కో దాంట్లో వెయ్యి రూపాయలు పెట్టండి. ఒక ఫండ్ కాకపోయినా ఇంకో ఫండ్ బాగా మంచి రిటర్న్స్ ఇస్తాయి.
  • ఆ ఐదు ఫండ్ కుడా ఒకటే సెక్టార్ లో కాకుండా స్మాల్ క్యాప్ లో ఒకటి, మిడ్ క్యాప్ లో ఒకటి, మీడియం, డెబిట్, గోల్డ్, లిక్విడ్ ఫండ్స్ లో ఆలా పెట్టుకోండి. అప్పుడు మీ రిస్క్ తగ్గుతుంది.
  • SIP మొత్తం మరియు తేదీని నిర్ణయించుకోండి.
  • దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించండి. షార్ట్ టైం కాదు. 5 సంవత్సరాలు కంటే ఎక్కువ.

SIP పన్ను నియమాలు:

Short-Term Capital Gains (STCG): 12 నెలల్లోపు విక్రయిస్తే 20% పన్ను (జూలై 23, 2024 నుంచి వర్తిస్తుంది).
Long-Term Capital Gains (LTCG): 12 నెలల తర్వాత ₹1.25 లక్షల మించి ఉంటె 12.5% పన్ను విధిస్తారు.
ప్రతి SIP విడతకు వేరే హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. Exit Load కొన్ని funds ముందుగా రీడీమ్ చేస్తే exit load వసూలు చేస్తాయి. పెట్టుబడి చేసేముందు Scheme Information Document (SID) చూడండి. SIPలకు ఎంట్రీ లోడ్ ఉండదు.

కొత్తగా SIP ప్రారంభించేవారు చేసే సాధారణ తప్పులు:

  • పాస్ట్ పెరఫామెన్స్ చూసి వాటి రాబడుల ఆధారంగా fund ఎంచుకోవడం.
  • చాలా ఎక్కువ funds‌ ఎంచుకుని దానిలో పెట్టుబడి పెట్టడం.
  • మార్కెట్ పడిపోవడాన్ని చూసి SIP ఆపడం.
  • అత్యవసర నిధులు(emergency fund), పెళ్లి, చదువులు, ఇల్లు కట్టడం కోసం దాచుకున్న డబ్బులు పెట్టుబడికి ఉపయోగించడం.
  • ప్రతి ఏడాది 15-20% రాబడిని ఆశించడం.
  • అధిక వడ్డీ రుణాలను పట్టించుకోకపోవడం.
సులబంగా SIP చేయగల వ్యూహం:
  • అత్యవసర నిధులు(emergency fund) ఏర్పాటు చేయండి.
  • అధిక వడ్డీ EMI లు ఉంటె ముందు అవి చెల్లించండి.
  • మీకంటూ ఒక ఆర్థిక లక్ష్యం నిర్ణయించుకోండి.
  • సరైన mutual fund ఎంచుకోండి.
  • తగినంత తక్కువ డబ్బుతో SIP ప్రారంభించండి.
  • క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించండి. స్కిప్ చేయొద్దు.
  • ఆదాయం పెరిగినప్పుడల్లా SIP పెట్టుబడి ఇంకా పెంచండి.
  • మీ పోర్ట్ఫోలియోను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.

చివరి మాట: SIP అనేది క్రమపద్ధతిగా పెట్టుబడి పెట్టే మార్గం, దీర్ఘకాలంలో సంపద నిర్మాణానికి సహాయపడుతుంది. చిన్న మొత్తంతో ప్రారంభించి, సరైన fund ఎంచుకుని, రిస్క్ అర్థం చేసుకుని, ఖర్చులు తగ్గిస్తూ, సరైన కాలపరిమితికి పెట్టుబడి పెట్టండి. ఈ గైడ్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే గాని, ఎటువంటి వ్యక్తిగత పెట్టుబడి సలహా కాదు. mutual fund లో పెట్టుబడులు మార్కెట్ ప్రమాదాలకు అనుగుణంగా ఉంటాయి. కాబట్టి మ్యుచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టె ముందు అది ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రొపెర్ స్టడీ చేశాకే పెట్టుబడి పెట్టండి, కానీ ఎవరో సోషల్ మీడియా లోచెప్పారని మాత్రం పెట్టకండి. మీకు తెలియకపోతే తెలుసుకుని చేయండి. అంతేకాని గుడ్డిగా పెట్టకండి. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, అలాంటప్పుడు తెలిసిన వ్యక్తిని సంప్రదించి వారిద్వారా అయినా పెట్టండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top