సేవింగ్స్ అకౌంట్ అనేది వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు బేసిక్ ఫౌండేషన్. ఇది మీ అవసరాల కోసం, జీతం దాచుకోవడానికి, కొంత కాలం పొదుపు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే UPI, డెబిట్ కార్డ్, ATMలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలతో సులభంగా డబ్బు తీసుకోవచ్చు. కానీ, ఎక్కువ వడ్డీ రేటు ఉన్న ఖాతా తప్పనిసరిగా అవసరం ఐతే లేదు. మీకు సరిపోయే ఖాతాను ఎంచుకొనే ముందు కనీస బ్యాలెన్స్ అవసరాలు, ATM సౌకర్యం, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీస్, ఛార్జీలు, బ్యాంకు నమ్మకం వంటి అంశాలు కూడా పరిశీలించాలి. మంచి సేవింగ్స్ అకౌంట్ అంటే ప్రతి ఒక్కరికీ ఒకేలాంటి బ్యాంక్ అకౌంట్ ఉండదు. మీ ఆదాయం, ఖర్చు, అలవాట్లు, మీ బ్యాంకింగ్ అవసరాలకు అనుగుణంగా ఏది మంచి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది మీరే ఎంచుకోవాలి.

క్రింద టాప్ 5 బెస్ట్ బ్యాంక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, దానిని పూర్తిగా చదివి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి?
- State Bank of India (SBI)
- HDFC Bank
- ICICI Bank
- Axis Bank
- Kotak Mahindra Bank.
- SBI సేవింగ్స్ అకౌంట్:— బ్రాంచ్ యాక్సెస్ కోసం మంచిది. ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. ఇది దేశంలో మొదటి స్థానంలో ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్లిన ఉపయోగించుకోవచ్చు. SBI పెద్ద బ్రాంచ్ మరియు ఎక్కువ ATM నెట్‌వర్క్ లను కలిగి ఉండడం వలన ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. SBI సేవింగ్స్ బ్యాంకు వడ్డీ రేటు ప్రస్తుతానికి 2.50% P.A ఇస్తుంది.
ఇది ఎవరికీ మంచిది: జీతం తీసుకునే వారు, కుటుంబాలు, విద్యార్థులు, బ్రాంచ్ ద్వారా సులభంగా డబ్బు తీసుకోవాలనుకునే వారికి.
- HDFC బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్: — డిజిటల్ బ్యాంకింగ్ కోసం HDFC బ్యాంక్ అధికంగా మొబైల్ బ్యాంకింగ్, UPI, ఆన్‌లైన్ చెల్లింపులు ఉపయోగించే వారికి అనుకూలం. ప్రస్తుత వడ్డీ రేటు 2.50% P.A. బ్యాంకు ని బట్టి వేరు వేరు నిబంధనలు ఉండవచ్చు.
ఇది ఎవరికీ మంచిది: జీతం తీసుకునే ఉద్యోగస్తులు, డిజిటల్ బ్యాంకింగ్ ఇష్టపడేవారు.
- ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్:— రోజువారీ డిజిటల్ చెల్లింపుల కొరకు ICICI బ్యాంక్ బలమైన డిజిటల్ సేవలు, UPI, కార్డులు మరియు ఆన్‌లైన్ ఖాతా నిర్వహణ అందిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు 2.50% P.A.
ఇది ఎవరికీ మంచిది: మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కోరుకునే వారు.
- ఆక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్:— ఇది వివిధ రకాల సేవింగ్స్ ఖాతాలు, డిజిటల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ సర్వీసులు మరియు బ్రాంచ్ యాక్సెస్ అందిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు 2.50% P.A.
ఇది ఎవరికీ మంచిది: ప్రైవేట్ బ్యాంకు తరహాలో డిజిటల్ మరియు బ్రాంచ్ బ్యాంకింగ్ రెండూ కావాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.
- కోటక్ మహీంద్రా బ్యాంక్:— డిజిటల్ ఖాతా తెరవడం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఇష్టపడే వారికి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా మంచిది. అకౌంట్ తెరిచే ముందు వడ్డీ రేటు, కనీస బ్యాలెన్స్, ఛార్జీలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
అందుకోసం మీరు ఏ బ్యాంక్ అకౌంట్ తెరవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క official website లో చూసి అప్పుడు మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి.

సేవింగ్స్ అకౌంట్ తెరవడానికి ముందు ఏమి పరిశీలించాలి? వడ్డీ రేటు మాత్రమే ఆధారంగా అకౌంట్ ఎంచుకోకండి. ఈ అంశాలు కూడా చూడండి.
- Intrest Rate: ప్రస్తుత రేటు, బ్యాలెన్స్ ఆధారంగా మారుతుందా అని తెలుసుకోండి.
- Minimum Balance: కొన్నిసార్లు కనీస బ్యాలెన్స్ Maintain చేయాలి. మీ ఆదాయం తక్కువ అయితే సేవింగ్స్ లేదా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ మంచివి.
- ATM, డెబిట్ కార్డ్ ఛార్జీలు, ఉచిత ATM లిమిట్‌లు, కార్డ్ ఛార్జీలు తెలుసుకోండి.
- డిజిటల్ బ్యాంకింగ్ చేయాలనుకుంటే నమ్మకమైన మొబైల్ బ్యాంకింగ్ apps, UPI, నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు ఉండేలా చూసుకోండి.
- క్యాష్ డిపాజిట్ ఎక్కువ చేస్తే లేదా సహాయం కావాలంటే దగ్గరలోని బ్రాంచ్ లేదా ATM కి వెళ్ళండి.
- కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది, ట్రాన్సాక్షన్ లో లోపాలు, కార్డ్ సమస్యలు త్వరగా ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోండి.
- కొన్ని బ్యాంకు అకౌంట్ లు ఫ్రీ అయినా కొన్ని సేవలకు ఛార్జీలు ఉండొచ్చు, వాటిని పరిశీలించండి.
- సేవింగ్స్ అకౌంట్ అయితే అత్యవసర డబ్బులు, రోజువారీ ఖర్చులు కోసం ఉపయోగపడుతుంది.
- ఫిక్స్ డిపాజిట్ చేస్తే బ్యాంకు వాళ్ళు కొంత వడ్డీని పే చేస్తారు మీకు.
- మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకొని ఉంటుంది కానీ అది ఎలా పనిచేస్తుందో సొంతంగా తెలుసుకొని SIP లేదా lumpsum ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఎవరో చెప్పారని మాత్రం అందులో అస్సలు పెట్టుబడి పెట్టకండి డబ్బు పోతే తిరిగి రాదు.
అత్యవసర నిధులు సేవింగ్స్ అకౌంట్ లో ఉంచడం మంచిది, రిటైర్మెంట్ కోసం దీర్ఘకాలిక పెట్టుబడులు మంచివి. బ్యాంకులో మీ డబ్బు సురక్షితం. ఇన్సూరెన్స్ ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్లను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా ఒక్కో డిపాజిటర్ కు రూ.5 లక్షల వరకూ కాపాడుతుంది. అందుకే అధిక వడ్డీ కోసం నమ్మకం లేని బ్యాంకులను కాకుండా, సురక్షితంగా, నిబంధనలతో కూడిన బ్యాంకును ఎంచుకోవడం ముఖ్యం.

మీకు సరిపోయే ఉత్తమ సేవింగ్స్ ఖాతా ఏది? ప్రతి ఒక్కరి అవసరాలు వేరే విధంగా ఉంటాయి.
- బ్రాంచ్ నెట్‌వర్క్ కోసం అయితే, All Over India కాబట్టి SBI బాగుంటుంది.
- డిజిటల్ బ్యాంకింగ్ కోసం అయితే HDFC లేదా ICICI.
- మంచి ప్రైవేట్ బ్యాంకు అయితే Axis మంచిది.
- తక్కువ ఆదాయంగల వారికి జీరో లేదా తక్కువ మినిమం బ్యాలెన్స్ అకౌంట్ సరిపోతుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ అకౌంట్ తీసుకోవాలి. మీరు సంవత్సరానికి 5 లక్షలు లోపు ట్రాన్సాక్షన్ చేస్తుంటే సేవింగ్స్ అకౌంట్ సరిపోతుంది.
మంచి సేవింగ్స్ అకౌంట్ సురక్షితంగా, సులభంగా డబ్బు తీసుకునేలా, తక్కువ ఛార్జీలతో, నమ్మకమైన డిజిటల్ బ్యాంకింగ్ మరియు తగిన వడ్డీ రేటుతో ఉండాలి. కేవలం ఎక్కువ వడ్డీ ఉన్న బ్యాంకు అకౌంట్ కోసం ఆకర్షితులు కావద్దు. అకౌంట్ తెరవడానికి ముందు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుత వడ్డీ రేటు, కనీస బ్యాలెన్స్, ATM/డెబిట్ కార్డ్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్ లిమిట్స్, బ్యాంకు అకౌంట్ రూల్స్ & నిబంధనలు ఖచ్చితంగా పరిశీలించండి.
Note: ఈ సమాచారం కేవలం మీ యొక్క అవగాహనా కోసం మాత్రమే, ప్రత్యేకంగా ఏ బ్యాంకు అకౌంట్ తెరవమని మేము చూచించడం లేదు.
